కొంప ముంచుతున్న ఎమ్మెల్యేలు, మైండ్ ఉందా పోయిందా…?

-

ఒక పక్క కరోనా వస్తుంది రోడ్ల మీద తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రతీ ఒక్కరిని కోరుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా పక్కాగా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విస్తరించకుండా ఉండాలి అంటే జనాలు ఎవరూ బయటకు రాకూడదు. అందుకే లాక్ డౌన్ ని ప్రకటించారు. లాక్ డౌన్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.

కాని ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరుగుతున్నారు. సామాన్య ప్రజలు ఏమో ఇళ్ళకు పరిమితం అవుతుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారు. తాజాగా కర్ణాటక ఎమ్మెల్యే ఒకరు ఇలాగే చేసారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గ జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌ తుమకూరు సమీపంలో హైవేపై తన మనవడితో కలిసి రోడ్డు మీద ఆడుకున్నారు.

తన కుమార్తె కొడుకుతో ఛార్జింగ్‌ జీపులో ఆయన రోడ్డుపై సందడి చేసారు. ఎమ్మెల్యే మనవడితో నిలబడిన రోడ్డులోనే జిల్లా ఎస్పీ కార్యాలయ౦ ఉన్నా సరే అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కూడా ఆయన్ను ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి బాధ్యతాయితంగా ప్రవర్తించాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం ఏంటీ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news