ఏపీ సీఎంగా జగన్ ఏ ముహూర్తంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారో.. కానీ, ఆయన వ్యూహాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతు న్నాయి. తొలి తొమ్మిది మాసాల పరిస్థితిని తీసుకుంటే.. ఆయన వేగంగానే పనులు చేశారు. అయితే, ఈ క్రమంలోపీపీఏలపై రి వ్యూ వంటివి కేంద్రం నుంచి విముఖత ఎదుర్కొనాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఇక, రాజధానితరలింపు అంశం ఏకంగా అమ రా వతి ప్రాంతంలో నిప్పులు రాజేసింది. ఈలోగా స్థానిక ఎన్నికల సమరం వచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రంలో తి రుగులేని ఆధిపత్యం సాధించాలని భావించిన నేపథ్యంలోనే కరోనా రాష్ట్రంలో కలకలం రేపింది. దీంతో జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి.
అంతేకాదు, జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మరో కీలక పథకం, వైసీపీ ప్రభుత్వ హయాంను కొన్ని తరాల పాటు ప్రజలు గుర్తుంచుకునేలా చేసే పథకం పేదలందరికీ ఇళ్లు! ఈ పథకం కూడా కరోనా ఎఫెక్ట్ కారణంగా నిలిచిపోయింది. దీనిని వచ్చే నెల అంటే ఏప్రిల్ 14కు వాయిదా వేసినా.. అప్పటికీ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యం లో అప్పటికి కూడా సాగే పరిస్థితి లేదు. ఇక, ఈ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుంది. దీంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉంది.
దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి. పనులు నిలిచిపోయాయి. ఈ నేపత్యంలో కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలు ప్రభుత్వంపై ఆర్ధిక భారాన్ని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం అన్నీ ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేసమయంలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో ప్ర భుత్వం వచ్చే ఏడాది వరకు కూడా ఆదాయాన్ని వదులుకుని అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తు న్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు వడ్డీలు కడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఏడాది కాలం పాటు రాష్ట్రాన్ని ముందుకు లాగడం అంటే మాటలు కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ వ్యూహాలు ఒకింత నత్తనడకన సాగే అవకాశంలేక పోలేదని అంటున్నారు. ఈ ప్రభావం నిరుద్యోగం, రాష్ట్ర జీడీపీ వంటి వాటిపై కూడా పడుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. కరోనా ప్రభావం జగన్ భావి ప్రణాళికలను భారీగా దెబ్బతీస్తుందని అంటున్నారు పరిశీలకులు.