ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయాలు హుజూరాబాద్ వేదికగానే జరుగుతున్నాయి. ఏది జరిగినా ఇప్పుడు హుజూరాబాద్ నేపథ్యంలోనే అన్నట్టు పరిణామాలు ఉంటున్నాయి. ఇదే క్రమంలో గులాబీ పార్టీలో అసలు ఎవరిని పోటీకి దింపుతుంని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఒకప్పుడు కమలాపూర్‌నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన దివంగత నేత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి కుటుంబానికి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక దామోదర్‌రెడ్డి అన్న అయిన రిటైర్డు కలెక్టర్, ప్రస్తుత వేములవాడ ఆలయ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. తమ్ముడి వారసుడిగా అన్నకు మంచి గుర్తింపు ఉండటంతో ఆయనకు టికెట్ ఫైనల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో దామోదర్‌రెడ్డి కొడుకు అయిన కశ్యప్ రెడ్డి నిన్న టీఆర్ ఎస్‌లో చేరారు. ఆయన చేరుతారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే కశ్యప్ కు టికెట్ ఇస్తారా లేక పురుషోత్తంరెడ్డికే ఇస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఒకవేళ ముద్దసాని ఫ్యామిలీకి టికెట్ దక్కితే పురుషోత్తం రెడ్డికే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఇతరులకు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.