కౌశిక్ రెడ్డి…హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో బాగా హైలైట్ అయిన పేరు…కాంగ్రెస్ పార్టీలో ఉంటూ…టీఆర్ఎస్ నేతలని రహస్యంగా కలిసి సరికొత్త రాజకీయం నడిపించారు. అయితే కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో…ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసి…టీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే హుజూరాబాద్ సీటు దక్కుతుందని కౌశిక్ అనుకున్నారు…కానీ సీటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు దక్కింది.
దీంతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు కోసం కౌశిక్ కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరిగారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక స్టోరీ అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ అధికార బలాన్ని తట్టుకుని ఈటల విజయం సాధించారు. ఇక తర్వాత కౌశిక్ అడ్రెస్ లేరు…మధ్యలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా అంతే ఆ తర్వాత నుంచి కౌశిక్ పోలిటికల్ స్క్రీన్ పై కనబడటం లేదు. ఏదో అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం…ఈటలపై విమర్శలు చేయడం చేస్తున్నారు.
తాజాగా కూడా ఈటలపై విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఎప్పటిలాగానే పాత విమర్శలు చేశారు.. ఈటల..హుజూరాబాద్ లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. హుజూరాబాద్ ప్రజలని మోసం చేస్తూ…గజ్వేల్ లో పోటీ చేస్తానని అంటున్నారని, దమ్ము ధైర్యం ఉంటే ఈటల హుజూరాబాద్ లో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు.
అసలు హుజూరాబాద్ అంటే ఈటల అడ్డా అక్కడ…ఆయన్ని పోటీ చేయమని సవాల్ చేయడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్ కు చెక్ పెట్టడానికి ఈటల గజ్వేల్ బరిలో నిలుస్తానని అంటున్నారు. అంతే గాని హుజూరాబాద్ ని వదిలేస్తానని చెప్పడం లేదు…ఒకవేళ ఈటల…గజ్వేల్ కు వెళితే..హుజూరాబాద్ లో ఈటల భార్య జమునా రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయిన నెక్స్ట్ కౌశిక్ రెడ్డికి సీటు వస్తుందో లేదో డౌట్..ఆయన ఈటలకు సవాల్ చేయడం కాస్త వింతగానే ఉంది…ఒకవేళ సీటు వచ్చిన ఈటలని దాటుకుని హుజూరాబాద్ లో గెలవడం కష్టమే.