చంద్రబాబుతో మంచు మోహన్ బాబు భేటీ

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు, వైఎస్ఆర్ నేత మంచు మోహన్ బాబు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్ష నేతతో జగన్ కుటుంబానికి సన్నిహుడైన మోహన్ బాబు భేటీ అవ్వడం చర్చనీయాంశం అవుతోంది.

మోహన్ బాబుకు చంద్రబాబుతో అంత సన్నిహిత సంబంధాలు లేవు. గత ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని మోహన్ బాబు రోడ్ ఎక్కారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత వీరు ఎక్కడా కలుసుకోలేదు. అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలిపారు.

గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరినప్పటికీ మోహన్ బాబు తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే జగన్ పాలనపై ఆయన ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కొన్నాళ్ల క్రితం తన కుటుంబంతో సహా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు ఆ ప్రచారాన్ని ఖండించలేదు కానీ.. ధ్రువీకరించలేదు. ఆ తర్వాత పలు సందర్భాల్లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని.. ఒక వేళ రాజకీయం అంటూ చేస్తే బీజేపీతోనేనన్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మోహన్ బాబు స్వయంగా వెళ్లి చంద్రబాబుతో భేటీ అయినట్లుగా బయటకు తెలియడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే వ్యక్తిగత పరిచయాలతో భేటీ అయి ఉంటారని.. రాజకీయం కోసం కాదని కొంత మంది చెబుతున్నారు. ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రారని భావిస్తున్నారు. మోహన్ బాబు మళ్లీ టీడీపీలోకి వచ్చే అంశం చర్చకు రాలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల మోహన్ బాబు కుటుంబానికి చెందిన విద్యానికేతన్‌ను … మోహన్ బాబు యూనివర్శిటీగా మార్చారు. ఈ క్రమంలో ఆ యూనివర్శిటీ ప్రారంభోత్సవం లేదా ఇతర అంశాలపై చతంద్రబాబుతో భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news