కవితకు టికెట్​ లేనట్లేనా? తొలి జాబితాలో దక్కని చోటు

-

వచ్చే లోక్​సభ ఎన్నికలకు బీఆర్​ఎస్​ సిద్ధమవుతోంది. ఇందుకోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్న పార్టీ అధినేత కేసీఆర్​.. సోమవారం నలుగురి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. కరీంనగర్​ నుంచి వినోద్​కుమార్​, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్​, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్​ నుంచి మాలోత్​ కవిత పేర్లను ఖరారు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కల్వకుంట్ల కవిత పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఆమెకు టికెట్​ నిరాకరిస్తున్నట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​.. లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొమ్మిది సిట్టింగ్​ల్లో దాదాపు ఏడుగురికి టికెట్​ నిరాకరించారు. కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించారు. అయితే, మరోసారి లోక్​సభ ఎన్నికల బరిలో నిలువాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నట్లు సమాచారం. కానీ, లిక్కర్​ స్కాం వివాదం నేపథ్యంలో ఆమెకు కేసీఆర్​ టికెట్​ నిరాకరిస్తున్నట్లు సమాచారం.

నిజామాబాద్​ ఎంపీ బరిలో ​ బాజిరెడ్డి గోవర్ధన్?

బీజేపీ సిట్టింగ్​ ఎంపీ ధర్మపురి అరవింద్​కు మరోసారి టికెట్​ లభించింది. ఆయన ఢీకొట్టగల నాయకుడి కోసం చూస్తున్న బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​.. నిజామాబాద్​ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అరవింద్, బాజిరెడ్డి సామాజికవర్గం ఒక్కటే కావడం, నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయ సంఖ్యలో ఉండటంతో బాజిరెడ్డి గోవర్ధన్​కు టికెట్​ కేటాయిస్తే విజయావకాలు ఉంటాయని బీఆర్​ఎస్​ భావిస్తోంది. రేపో మాపో బాజిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news