కేసీఆర్ సైలెంట్ ఆపరేషన్….రేవంత్‌ను దింపేందుకు సూప‌ర్ స్కెచ్

-

ముస‌లోడే కానీ మ‌హానుభావుడు అని ఓ సినిమాలో బ్ర‌హ్మానందం చెప్పిన డైలాగ్ అంద‌రికీ గుర్తుంటే ఉంటుంది.సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా యువ‌త ఈ డైలాగ్‌ని బాగా వాడేస్తున్నారు.ఇప్పుడు తెలంగాణ‌మాజీ ముఖ్య‌మంత్రి కెసీఆర్‌కి ఈ డైలాగ్‌ను ఆపాదిస్తున్నారు ఆక్క‌డి విశ్లేష‌కులు.అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత గులాబి పార్టీ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డింది.ఒక్కొక్క‌రుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఖండువాలు క‌ప్పుకున్నారు.కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌…లిక్క‌ర్ స్కామ్‌లో జైలుకెళ్ళారు…బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నా కెసీఆర్ ఫామ్‌హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు.ఎక్క‌డా ఏ విధ‌మైన వ్యాఖ్య‌లు కానీ విమ‌ర్శ‌లు కానీ చేయ‌కుండా సైలెంట్ చూస్తూ ఉండిపోయారు. ప్ర‌తిప‌క్షంలో ఉంటే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేరా అనే స్థాయిలో సెటైర్లు కూడా కొంద‌రు పేల్చారు.కానీ కేసీఆర్‌లో స్పంద‌న లేదు. అయితే తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే కెసీఆర్ సైలెంట్‌గా గేమ్ ఛేంజ‌ర్‌లా మారిపోయారని చ‌ర్చించుకుంటున్నారు.

Congress won't even win 20 seats, Revanth won't be CM: KCR

హైదరాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో వరుసపెట్టి భవనాలు కూల్చేస్తుంటే తెలంగాణ హైకోర్టు కూడా స్పందించకపోవడంతో ఇక దానిని అడ్డుకునేవాళ్ళే లేరన్నట్లు దూసుకుపోయింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. అయితే మూసీనది పక్కనే ఇళ్ళు నిర్మించుకొని దశాబ్ధాలుగా ఉంటున్న సామాన్య, మద్య తరగతి ప్రజలపై దృష్టి సారించేసరికి హైడ్రాకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. మూసీవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు.

సాధారణంగా ఎన్ని క‌ష్టాలు ఎదువుతున్నా పేద, మద్యతరగతి ప్రజలు మౌనంగా భరిస్తూ జీవనం సాగిస్తారే తప్ప ఎన్నడూ బహిరంగంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి విమర్శించడానికి ఇష్టపడరు. కానీ తొలిసారిగా మూసీవాసులు బహిరంగంగా సిఎం రేవంత్‌ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. మీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినందుకు బాగా బుద్ధి చెపుతున్నారంటూ విరుచుకుపడుతున్నారు.ప్ర‌తీ ఇంటి గోడపై ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటు చేసుకుని వీధుల్లో టెంట్లు వేసుకొని సమావేశాలు పెట్టుకుంటున్నారు. రేయింబవళ్ళు ఇళ్ళ‌కు కాపలాకాస్తున్నారు.

KCR Vs Revanth Reddy: 20 or 80?

హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం తీరుని తప్పు పడుతున్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కూడా రంగంలో దిగి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేకపోయినా, పాలనలో ప్రజల అంచనాలు అందుకోలేకపోతున్నా ఎవరూ నోరు విప్పలేదు. కానీ హైడ్రా సామాన్య ప్రజలు జోలికి వచ్చేసరికి వారు రోడ్లపైకి వచ్చి రేవంత్‌ రెడ్డిని విమర్శిస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. హైడ్రా కూల్చివేతలని తప్పు పడుతున్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా హైడ్రాకి బ్రేకులు వేసింది. ఇదే క్ర‌మంలో రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించేందుకు రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని ఆ పార్టీ నేత‌లు చెప్తున్నా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ఏదో తేడా కొడుతోందే అని చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి.

హైడ్రా కారణంగా కేవలం 10 నెలల్లోనే ప్ర‌భుత్వంపై ప్రజా వ్యతిరేకత నెలకొనడంతో హైక‌మాండ్ సీరియ‌స్ అయింద‌ని స‌మాచారం. కూల్చివేత‌ల‌కు వెంట‌నే బ్రేకులు వేయాల‌ని హెచ్చ‌రించార‌ట ఢిల్లీ పెద్ద‌లు.కాంగ్రెస్ హైకమాండ్‌తో తెర‌చాటున కేసీఆర్ క‌థ‌న‌డిపార‌ని తెలంగాణ‌లో ఆనోటా ఈనోటా చ‌ర్చించుకుంటున్నారు.బిఆర్ఎస్‌ను ఖాళీ చేయించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న రేవంత్‌కి హైడ్రా పేరుతో ప‌ద‌వీగండం ఏర్ప‌డ‌టంతో…షాక్ భ‌లేఉందిగా అంటూ గులాబీ పార్టీ నేత‌లు న‌వ్వుకుంటున్నార‌ట‌.మొత్తానికి కేసీఆర్ చాలా సైలెంట్‌గా రేవంత్‌ని దించేసే ప్లాన్ వేశార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news