తెలంగాణా మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కెసిఆర్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. తెరాస అన్ని స్థానాల్లో విజయం సాధించాలని లేకపోతే మంత్రులకు కేబినేట్ నుంచి ఉద్వాసన తప్పదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా అలసత్వం ఉండకూడదు అంటూ ఎమ్మెల్యేలకు పార్టీ కీలక నేతలకు కెసిఆర్ స్పష్టంగా సూటిగా చెప్పిన సంగతి తెల్సిందే.
ఇక ఇదిలా ఉంటే తాజాగా పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కెసిఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరూ రెబల్స్‌గా బరిలోకి దిగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులదే రెబల్స్‌ను సాధ్యమైనంత మేర బుజ్జగించాలని, వారిని ఇతర పదవులపై హామీ ఇవ్వాలని నేతలకు సూచించారు. అయినా సరే వినని వారిపై వేటు,
తప్పదని హెచ్చరించాలని కేసీఆర్ నేతలకు స్పష్టం చేసారు. రెబల్స్ విషయంలో భవిష్యత్తులోనూ కఠినంగా ఉంటామన్న ఆయన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని హెచ్చరించారు. రాజకీయ పార్టీ అన్న తరువాత అసంతృప్తులు ఉండటం సహజమేనన్నారు. అయితే ఎన్నికల సమయంలో సర్దుకుపోవాల్సి ఉంటుందని ఆయన గెలుపుపై ధీమాతో నేతలెవరూ అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు.