మీరు నా బిడ్డలు… సెంటిమెంట్‌తో కొట్టిన కేసిఆర్…!

-

తెలంగాణాలో ఆర్టీసి సమ్మెకు ముగింపు కార్డు పడింది. దాదాపు రెండు నెలల నుంచి సమ్మె జరిగింది. ఈ సమ్మెలో ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలి అంటూ కార్మికులు తెలంగాణా ఉద్యమం స్థాయిలో ఈ సమ్మె జరిగిందని తెలంగాణా వాదులు సైతం వ్యాఖ్యానించారు. ఇక కెసిఆర్ వెనక్కి తగ్గుతారని, అటు కార్మిక నాయకులు ఇటు కార్మికులు అందరూ భావించారు. కాని వాళ్ళు అనుకున్నది ఏ ఒక్కటి జరగలేదు. కెసిఆర్ కనీసం వాళ్ళను చర్చలకు కూడా పిలిచే ప్రయత్నం చేయలేదు అంటే సమ్మె విషయంలో కెసిఆర్ ఏ విధంగా వ్యవహరించారో అర్ధమవుతుంది.

అది అలా ఉంటే ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేసారు. కార్మికులు మా బిడ్డలు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే సంస్థ బాగుంటుంది, వాళ్ళు ఎవరి మాటలు వినకుండా ఉద్యోగాలు చేస్తే… సింగరేణి తరహాలో గుండెల్లో పెట్టుకుంటాం… కార్మికులను నేనే ప్రగతి భవన్ కి వారం తర్వాత పిలుస్తా… మీరు పడిన బాధలు నాకు తెలుసు… మీ కుటుంబాలు పడిన ఇబ్బందులు తెలుసు… తక్షణ సాయం కింద వంద కోట్లు ఇస్తున్నాను… మీకు వెంటనే జీతాలు కూడా ఇస్తాం అని ప్రకటించారు.

మొదటి పేరాలో కెసిఆర్ మీద కార్మికుల్లో వ్యతిరేకత ఉంది, రెండో పేరాలో కార్మికులకు కెసిఆర్ దేవుడు అయ్యారు… అవును ఇప్పుడు కెసిఆర్ కార్మికులకు దేవుడు అయ్యారు… ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ఆయన దేవుడు అయ్యారు. సమ్మెను ముందుండి నడిపించిన యునియన్లను ఒక్క మాటలో చెప్పాలి అంటే కెసిఆర్ చంపేశారు. నేను వాళ్ళను సహించను… మీరు నా మాట వినండి బాగుపడతారు… చార్జీలు కూడా పెంచుకోండి అని సూచించారు. కార్మికుల సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాల్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు… ఎవరి మాట వినకుండా కష్టపడి పని చేస్తే బోనస్ లు కూడా ఇస్తా అన్నారు… కార్మికులు రేపు పాలాభిషేకం చేస్తామని ప్రకటించారు అంటే కెసిఆర్ వాళ్ళను ఏ విధంగా సెంటిమెంట్ తో కొట్టారో స్పష్టంగా అర్ధమవుతుంది. కార్మికుల డిమాండ్లు ఒక్కటి కూడా నెరవేరలేదు… తాను ప్రభుత్వంలో కలిపేది లేదనే విషయాన్ని కూడా కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కెసిఆర్ మీద ఏ విమర్శలు చేసినా కార్మికుల నుంచి వాళ్లకు వ్యతిరేకత వచ్చే స్థాయిలో కెసిఆర్ మాట్లాడారు.

ఎదిఎలా ఉన్నా సమ్మెలో కఠినంగా వ్యవహరించిన వ్యక్తే నేడు వాళ్లకు దేవుడు అయ్యారు… ఇక ఈ సమ్మెలో కెసిఆర్ ని తక్కువ అంచనా వేసిన వాళ్లకు కూడా ఆయన చాలా విషయాలు చెప్పారు… కార్మికులు ఇప్పుడు కెసిఆర్ ని దాటి వెళ్ళే అవకాశం నూటికి నూరు శాతం లేదు… యూనియన్ల మాటను గాని… కార్మిక నాయకుల మాటను గాని కార్మికులు వినే పరిస్థితి లేకుండా కెసిఆర్ కార్మికులను తన వైపుకి తిప్పుకోవడంలో దాదాపుగా విజయవంతం అయ్యారు. ఏది ఎలా ఉన్నా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణాలో మరో సమ్మె జరిగే అవకాశం లేదు అనేది వాస్తవం.

Read more RELATED
Recommended to you

Latest news