కోదండరాం రూట్ మారుతుందా?

కోదండరాం….తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. తెలంగాణ జే‌ఏ‌సిని ముందుండి నడిపించిన కోదండరాం kodhandaram…అనూహ్యంగా తెలంగాణ వచ్చాక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ముందుకెళుతున్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ దూరం పెట్టడంతోనే కోదండరాం తెలంగాణ జనసమితి పేరు మీద పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు.

kodandaram tjs - Telangana Janasamithi
kodandaram tjs – Telangana Janasamithi

అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వచ్చిందిగానీ, ఆయన పార్టీకి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ రావడం లేదు. కోదండరాం పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కోదండరాం వ్యూహాత్మక తప్పిదం చేస్తూ, కాంగ్రెస్, టీడీపీలతో జత కట్టారు. దీంతో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు.

ఎన్నికలయ్యాక కోదండరాం సెపరేట్‌గా రాజకీయాలు చేస్తూ ముందుకెళుతున్నారు. అయితే ఇటీవల మాత్రం కోదండరాం రాజకీయాల్లో కాస్త దూకుడుగా ఉంటున్నారు. ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నారు. అటు సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాకపోతే ఎన్ని చేసిన కోదండరాం పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడటం లేదు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఆ పార్టీ బలపడేలా కనిపించడం లేదు. మరి కోదండరాం పోలిటికల్‌గా ఎలా ముందుకెళ్తారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. మొన్న ఏ మధ్యన కోదండరాం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలని కోదండరాం ఖండించారు. తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే కాదు మరే ఇతర పార్టీలోనూ తమ పార్టీని విలీనం చేయమని చెప్పారు. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం కోదండరాం, కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌ని ఎలాగైనా గద్దె దించాలని కోదండరాం భావిస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఆయన రేవంత్ రెడ్డితో కలిసి ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు.