రాజ‌కీయ ఒత్తిళ్లు… వారసులే కోడెల‌ను చంపేశారా…?

-

ఏపీ మాజీ స్పీక‌ర్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మృతి చెందారు. సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో ఈ ఆత్మ‌హ‌త్య‌కు ఆయ‌న ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలుస్తోంది. విష‌యం తెలుసుకున్న సెక్యూరిటీసిబ్బంది, కుటుంబ స‌భ్యులు .. వెంట‌నే ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు వైద్యులు నిర్దారించారు.

సొంత ఇంట్లోనే ఆయ‌న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు స‌మాచారం. 1983లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కోడెల అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుమేర‌కు పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. త‌ర్వాత టీడీపీ త‌ర‌ఫున రాజ‌కీయంగా ఓ రేంజ్‌కు ఎదిగారు. ఆయ‌న మంత్రిగా, ఎమ్మెల్యేగా తాజాగా మాజీ స్పీక‌ర్‌గా ఏపీకి అనేక రూపాల్లో సేవ‌లందించారు.

చంద్ర‌బాబు, ఎన్టీఆర్ కుటుంబాల‌కు అత్యంత స‌న్నిహితుడిగా కూడా కొడెల గుర్తింపు తెచ్చుకున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ కుటుంబంతోనూ ఆయ‌న ప్ర‌త్యేకంగా అనుబంధం ఉంది. రాజ‌కీయాల్లోనూ వ్య‌క్తిగ‌త జీవితంలోనూ బాల‌కృష్ణ‌తో ఎంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అయితే, గ‌త ప్ర‌భుత్వ స‌మ‌యంలో ఆయ‌న అసెంబ్లీ ఫ‌ర్నిచ‌ర్ విష‌యంలో వివాదాస్ప‌దం కావ‌డం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news