తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి సాగుతూ వస్తున్న ఆయన ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముందుగా నరసరావుపేట నుంచి రాజకీయాలు కొనసాగించిన కోడెల 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఆయన తొలి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. కొద్దిరోజులుగా కోడెలపై కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఇక ఐదేళ్ల పాటు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఆయన వారసుడు కోడెల శివరాం ప్రసాద్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి ఎన్నో అరచకాలకు పాల్పడ్డారు. ఇక పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పాటు సత్తెనపల్లిలో కోడెల ఓడిపోవడంతో కోడెల బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులుగా తీవ్రమైన ఆందోళనతో ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన సోమవారం తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఆసుపత్రికి తరలించేలోగానే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. బసవ తారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు చేతులు ఎత్తేసినట్టు సమాచారం.