ఇదొక్కటీ చాలు కొరటాల – చిరు సినిమా బ్లాక్ బస్టర్ ?

-

‘సైరా’ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అక్టోబర్ రెండవ తారీకున గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన సైరా దసరా సెలవులను కూడా కవర్ చేయడంతో ఆ సమయంలో ఏ పెద్ద సినిమా లేకపోవడంతో చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా కి బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు ఓపెనింగ్స్ రావటం జరిగాయి.

Image result for koratala chiranjeevi

దీంతో పాలిటిక్స్ నుండి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టడంతో నెక్స్ట్ కొరటాలతో చేయబోయే సినిమా తో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

 

అదేమిటంటే ఈ సినిమాలో నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ నటించబోతున్నట్లు రామ్ చరణ్ పాత్ర అరగంటసేపు ఉన్నట్లు సినిమాకి రామ్ చరణ్ పాత్ర హైలెట్ అవుతున్నట్లు ఆ విధంగా డైరెక్టర్ కొరటాల చెర్రీ పాత్ర డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమే అయితే ఇదొక్కటీ చాలు కొరటాల – చిరు సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి అని ఇండస్ట్రీలో వారు మరియు మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news