WEF సదస్సుకు హాజరు కావాలని కేటీఆర్ కు ఆహ్వానం

-

KTR gets invitation from WEF

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.

అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్.. అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ప్రపంచాన్ని ఆకర్షించారు. ఈనేపథ్యంలో కేటీఆర్.. ఈ సదస్సులో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధిపై మాట్లాడనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news