మ‌హేష్ బాబు 26వ సినిమా టైటిల్ ఇదే..!

-

మహేష్ కొత్త సినిమాకు స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబు రాజ‌కుమారుడు సినిమా ద‌గ్గ‌రి నుంచి చేసిన సినిమాల టైటిల్స్‌తో ఓ వీడియోను కూడా రూపొందించి విడుద‌ల చేశారు.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమా ఇచ్చిన విజ‌యంతో మ‌హేష్ బాబు మంచి జోరు మీద ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో అటు మ‌హేష్ మాత్ర‌మే కాదు, ఆయ‌న అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

మహేష్ కొత్త సినిమాకు స‌రిలేరు నీకెవ్వ‌రూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబు రాజ‌కుమారుడు సినిమా ద‌గ్గ‌రి నుంచి చేసిన సినిమాల టైటిల్స్‌తో ఓ వీడియోను కూడా రూపొందించి విడుద‌ల చేశారు. కాగా సినీ ఇండ‌స్ట్రీలో సిల్వ‌ర్ జూబ్లీ పూర్తి చేసుకున్న మ‌హేష్ బాబు సరిలేరు నీకెవ్వ‌రూ చిత్రంతో స్వ‌ర్ణ‌యుగంలోకి అడుగుపెడుతున్నాడంటూ రూపొందించిన ఓ వీడియో ఆయ‌న అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

కాగా స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా టైటిల్ చివ‌ర్లో ఓ తుపాకీని ఉంచి దానిపై సైనికుడి టోపీ పెట్టారు. అంటే ఇది క‌చ్చితంగా ఓ సైనికుడికి చెందిన క‌థ అని, ఆర్మీ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని మ‌న‌కు తెలుస్తుంది. ఇక మ‌హేష్ న‌టిస్తున్న 26వ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రూ 2020 సంక్రాంతికి విడుద‌ల అవుతుంద‌ని ఆయ‌న తండ్రి కృష్ణ తెలిపారు. కాగా ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా తెలిపింది. మ‌హేష్‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని ర‌ష్మిక చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాను మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందివ్వ‌నున్నాడు. కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇవాళ ఈ సినిమా షూటింగ్‌ను లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news