టార్గెట్ అరవింద్‌..కేటీఆర్ రివెంజ్..అసెంబ్లీ బరిలోనే.!

-

తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించిన నాయకుడు ఎవరంటే ధర్మపురి అరవింద్ అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఓటమి ఎరగని కే‌సి‌ఆర్ ఫ్యామిలీని రాజకీయంగా ఎదురుదెబ్బ కొట్టారు. కే‌సి‌ఆర్ కుమార్తె కవితని ఓడించారు. దీంతో కవిత ఓటమి బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ బరిలో కవితపై అరవింద్ విజయం సాధించారు. బి‌జే‌పి నుంచి పోటీ చేసి గెలిచారు. అలా అరవింద్..కవితని ఓడించడంతో బి‌ఆర్‌ఎస్..ఈ సారి అరవింద్‌కు చెక్ పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది.

ఇప్పటికే కవిత…అరవింద్ టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అటు అరవింద్ కూడా తగ్గకుండా కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా కవిత, అరవింద్‌ల మధ్య వార్ నడుస్తోంది. ఇదే సమయంలో కే‌టి‌ఆర్ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నిజామాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించిన కే‌టి‌ఆర్..అక్కడ జరిగిన సభలో అరవింద్ పై ఫైర్ అయ్యారు. జామాబాద్ ఎంపీ కుసంస్కారంగా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని,  హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అరవింద్ మొదట అసెంబ్లీ బరిలో దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన ఆర్మూర్ లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం వస్తుంది. అదే జరిగితే అక్కడ బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేత..అరవింద్‌కు చెక్ పెట్టించాలని చూస్తున్నారు.

ఒకవేళ నిజామాబాద్ ఎంపీగా మళ్ళీ బరిలో దిగితే..ఈ సారి అక్కడ కవితని పోటీ చేయించి ఖచ్చితంగా గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్తితుల్లోనూ అరవింద్‌ని ఓడించడమే లక్ష్యంగా కే‌టి‌ఆర్ ముందుకెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news