బాబుకు బీ ఫారాలు ఇవ్వగా మిగిలింది 65 సీట్లయితే 88 ఎలా గెలుస్తారు లక్ష్మీనారాయణ: విజయసాయిరెడ్డి కౌంటర్

-

జనసేన పోటీ చేసింది 140 సీట్లలో… అది కూడా సొంత బలం మీద. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం వామపక్షాలు 14, అలా మొత్తం చేరి 175 సీట్లలో జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.

ఈసారి జనసేన అధికారంలోకి రాబోతుంది. 88 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఇది ఖాయం.. అని వైజాగ్ లోక్ సభ అభ్యర్థి, పార్టీ నేత వీవీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీనారాయణకు దీటుగా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం.. మళ్లీ విజయసాయిరెడ్డి కౌంటర్ కు లక్ష్మీనారాయణ కౌంటర్ అటాక్ చేయడం.. ఇలా వీళ్లిద్దరి మధ్య ట్విట్టర్ల యుద్ధం ప్రారంభమైంది.

లక్ష్మీనారాయణ కౌంటర్ కు ముందుగా విజయసాయిరెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారంటే… జేడీ గారూ.. గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు పోగొట్టుకున్నట్టుగానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి త్యాగం చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్ కు వెళ్లండి.. అంటూ కౌంటర్ ఇచ్చారు.

దానికి వీవీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. జనసేన పోటీ చేసింది 140 సీట్లలో… అది కూడా సొంత బలం మీద. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎం వామపక్షాలు 14, అలా మొత్తం చేరి 175 సీట్లలో జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.

మీరు సీఏ చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి. ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్లం కాబట్టి.. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.. అంటూ వీవీ కౌంటర్ అటాక్ లు ఇవ్వడం… దానికి విజయసాయి రెడ్డీ మళ్లీ కౌంటర్లు ఇవ్వడం.. ఇలా వాళ్ల మధ్య ట్వీట్ల యుద్ధమే నడిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version