ఉత్తరప్రదేశ్ లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. మే 6న రెండో విడత, మే 12న మూడో విడత, మే 19న నాలుగో విడత ఎన్నికలు జరుగుతాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల్లో ప్రచారం చేయడానికి నా దగ్గర రూపాయి లేదు. ఎలా ప్రచారం చేయాలి. నాకు ఎన్నికల ప్రచారం కోసం 75 లక్షల రూపాయలు ఇవ్వండి. లేదా నా కిడ్నీ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి… అంటూ సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషోర్ సమ్మిట్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన ప్రస్తుతం బాలాఘాట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. తన అభ్యర్థులంతా ధనవంతులట. వాళ్లు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు వెదజల్లుతున్నారట. తన దగ్గరేమో రూపాయి లేదట. దీంతో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియక ఇదిగో ఇలా ఈసీకి లేఖ రాశారు.
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం… లోక్ సభ అభ్యర్థి 75 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. దీంతో 75 లక్షలు ఖర్చు పెట్టడానికి తన దగ్గర అంత డబ్బు లేదని.. ఇంకా ఎన్నికలకు 15 రోజులే మిగిలి ఉండటంతో తనకు ఎలాగైనా 75 లక్షలు ఇప్పించాలని ఆయన ఈసీని వేడుకున్నారు. లేదంటే ఏదైనా బ్యాంకు నుంచి లోనుగానైనా ఇప్పించాలని కోరారు. లేదంటే తన కిడ్నీ అమ్ముకునేందుకైనా అనుమతి ఇవ్వాలని ఈసీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.