ఆ టీడీపీ రెడ్లకు లక్కీ ఛాన్స్..!

-

ఏపీలో సామాజికవర్గాల వారీగా రాజకీయం నడుస్తుందనే సంగతి తెలిసిందే…ముఖ్యంగా కమ్మ-రెడ్డి వర్గాల మధ్య రాజకీయం ఎక్కువ ఉంటుంది…ఈ రెండు వర్గాల మధ్యే పోరు ఎక్కువ కనిపితోంది…ఎందుకంటే టీడీపీలో కమ్మ వర్గం ఎక్కువ ఉండటం, వైసీపీలో రెడ్డి వర్గం ఎక్కువ ఉండటం వల్ల…వార్ ఉంటుంది. అలా అని వైసీపీలో కమ్మ వర్గం వారు, టీడీపీలో రెడ్డి వర్గం వారు లేరని కాదు.

వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు…అలాగే టీడీపీలో రెడ్డి నేతలు ఉన్నారు. అయితే వైసీపీలో కమ్మ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు…కానీ టీడీపీలో రెడ్డి వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు లేరు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి వర్గం నేతలంతా ఓడిపోయారు. అయితే ఈ సారి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి..వైసీపీలో రెడ్డి వర్గం బలంగా ఉండే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పరిస్తితులు మారుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొందరు రెడ్డి నేతలు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకత టీడీపీ రెడ్డి నేతలకు లక్కీగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా లక్కీ ఛాన్స్‌కు దగ్గరగా కొందరు రెడ్డి నేతలు ఉన్నారని తెలుస్తోంది. అందులో మొదటగా పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన నల్లారి…ఈ సారి టీడీపీ నుంచి గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.

అలాగే పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి మంచి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోవూరులో శ్రీనివాస్ రెడ్డి, కాళహస్తిలో సుధీర్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, ఆలూరులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మ, ప్రొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డి…ఇలా కొందరు రెడ్డి నాయకులకు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version