మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్..10డివిజన్లలో ఎవరి సత్తా ఎంతంటే…!

-

ఆ నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. సెటిలర్స్ కి అడ్డాగా ఉండే ఈ నియోజకవర్గంలోని డివిజన్ లో ప్ర‌జ‌లు ప్ర‌ధాన ర‌హ‌దారి గుండా ఒక ప్రాంతం నుంచి మ‌రోక ప్రాంతానికి వెళ్లాలంటే ఖ‌చ్చితంగా ఏదో ఒక రైల్వేగేటు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. సంవ‌త్సరాలు గ‌డుస్తున్నా… ప్ర‌భుత్వాలు మారుతున్నాయి.. పాల‌కులు మారుతున్నా ఆ డివిజ‌న్లలోని ప్ర‌జ‌ల క‌ష్టాలు మాత్రం తీర‌డం లేదు. ఎన్నో ఆశ‌లతో గతంలో కార్పోరేట‌ర్లను గెలిపిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు అటు వైపు క‌న్నేత్తి పాపాన పోలేదంటున్నారు స్ధానికులు.

మ‌ల్కాజ్‌గిరి స‌ర్కిల్ ప‌రిధిలో ఉంది ఆరు,అల్వాల్ డివిజన్ పరిధిలో మూడు డివిజన్లు మ‌ల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఉన్నాయి. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే ఈసారి ముగ్గురు సిట్టింగ్ కార్పొరేటర్ లకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్త వారికి బీఫారాలు ఇచ్చింది టిఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీలు కొత్త, పాతల కలయికతో బి ఫారాలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అభ్యర్థుల విషయంపై చర్చ జరుగుతోంది.

మల్కాజ్ గిరిలో అన్ని రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఇక్క‌డ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు చెందిన వారు మ‌ల్కాజ్‌గిరిలో ఉండ‌టంతో ఈ ప్రాంతంలో సెటిల‌ర్ల హ‌వానే ఎక్కువ‌గా ఉంటుంది. దాదాపు ముప్పై, న‌ల‌భై సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇక్క‌డ సెటిల‌ర్లు వ‌చ్చి, స్ధానికుల‌తో క‌లిసిపోయార‌ని మ‌ల్కాజ్‌గిరి వాసులు చెబుతుంటారు. బ‌స్తీల్లో స‌మ‌స్య‌లు తీవ్రంగా ఉన్నాయి.

నేరేడ్‌మెట్ డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న డిఫెన్స్ కాల‌నీలో రోడ్ల ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంది. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేష‌న్ ముందే వ‌ర్షం నీరు రోజుల కొద్ది నిలిచిపోయినా మున్సిపాలిటి అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వారి ప‌ని త‌నానికి నిద‌ర్శంగా చెప్పొచ్చు. ఇక కాల‌నీల్లో ఎక్క‌డికక్క‌డ రోడ్ల‌ను తొవ్వి వ‌దిలేశారు. వ‌ర్షాకాలం కావ‌డంతో రోడ్ల‌న్ని గుంత‌లమ‌యం అయ్యాయి. వాటికి ఎలాంటి మ‌ర‌మ్మ‌త్తులు చేయ‌క‌పోవ‌డంతో నిత్యం ఆ ర‌హ‌దారుల‌పై ఎవ‌రో ఒక‌రు ప్ర‌మాదానికి గురై ఆసుప‌త్రి పాల‌వుతున్నార‌ని స్ధానికులు వాపోతున్నారు.

మ‌ల్కాజ్ గిరి ప్రాంతంలో ప్ర‌ధానమైన స‌మ‌స్య‌లు రైల్వేగేట్లు, రైల్వే అండ‌ర్ బ్రిడ్జిల కొర‌త‌, గుంత‌ల‌మ‌య‌మైన ప్ర‌ధాన ర‌హ‌దారులు, డ్రైనేజీల లేమి, ఫుట్‌పాత్ ల ఆక్ర‌మ‌ణ‌, కుంచించుకుపోయిన ప్ర‌ధాన‌ ర‌హ‌దారులు, అభివృద్ధికి ఆమ‌డ‌దూరంలో స్ల‌మ్స్, రోడ్ల పైనే చెత్తాచెదారం, మ‌ల్కాజ్‌గిరి నుంచి సికింద్రాబాద్ ర‌హ‌దారిలో మిల్ట్రీ ఏరియా ఉండ‌టంతో రాత్రి పూట రాక‌పోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు, అర‌కొర‌గా మంచినీటి స‌ర‌ఫ‌రా వంటి స‌మ‌స్య‌లతో డివిజ‌న్ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. గత గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రిస్తాన‌ని కార్పోరేట‌ర్లు హామి ఇచ్చారు. ఎన్నిక‌ల త‌రువాత విజ‌యం సాధించిన కార్పోరేటర్లు మాత్రం ఈ సమస్యలను లైట్ తీసుకున్నారు.

దేశంలోనే ఎక్కువమంది ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరి. దాదాపు 31 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఇక్కడ రైల్వేలైన్ల కారణంగా తరచూ గేట్లు పడటం.. ట్రాఫిక్‌ ఆటంకాలతో ప్రజలు నరకం చవిచూస్తున్నారు. సమస్య పరిష్కారానికి చేపట్టిన రైల్వే వంతెనల నిర్మాణం ఏళ్లుగా పూర్తికాకపోవడంతో వారి ఇక్కట్లు తీరే మార్గం కనిపించడం లేదు. ప్రతి 20 నిమిషాలకో గూడ్సు రైలు ఈ మార్గంలో వెళ్తుంటుంది. ఇలా రైలు వచ్చినప్పుడల్లా ఆయా చోట్ల గేట్లు పడడం… ట్రాఫిక్‌ నిలిచిపోవడం సర్వసాధారణంగా మారింది. రైల్వేవంతెనకు సమానంగా రహదారులు నిర్మించాల్సిన వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండడం లేదు. ఈ కారణంగా గంటల్లో పూర్తవాల్సిన ఆర్‌యూబీలు ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా భారీ విక్టరికొట్టారు. ఇక గ్రేటర్ ఎన్నికల బాధ్యతను బుజాలకెత్తుకున్న మైనంపల్లి పార్టీని విజయతీరాలకు చేరుస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news