నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

-

తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతోంది. ఆగని వర్షాలతో ఇంకా నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 60,545 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 3582 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు.. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1090.80 అడుగులుగా ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా… శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 89 టీఎంసీలు దాటింది. భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు అధిక నీరువస్తున్నందువల్ల ప్రాజెక్టు గేట్లు తెరవనున్నారు.

ప్రాజెక్టు గేట్లు తెరిస్తే.. మెండోరా , ఎరగట్ల , గుమిరాల , సోన్, లకమఛంద, మమడ , ఖానాపూర్ మండలాల పరిధిలోని నిజమబాద్ మరియు నిర్మల్ జిల్లా గోదావరి పరివాక గ్రామాల ప్రజలు నది లోనికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. గొర్రెలు, బర్రెల కాపరులు.. గోదావరి నదిలో మోటార్లు గల రైతులు, చేపల వేటకు పోయే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గత సంవత్సరం ఇదే సమయానికి 63 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిలువ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అందుబాటులోకి రావడంతో వచ్చే 2020 ఖరీఫ్ పంటకు క్యాలండర్ రూపొందించుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రబీ పంటను రైతులు తొందరగా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు ఉండటంతో త్వరలోనే రబీకి సంబంధించిన ప్రణాళిక రూపొందించనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news