ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. అలాగే కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులకు ఆయన ఆచూకీ లభించలేదు. ఇంటి వద్ద ఆయన కనిపించలేదు, నిన్న రాత్రి నుంచి ఇంట్లో రేవంత్ లేరు.
దీంతో, రేవంత్ కోసం ఆయన అనుచరుల ఇళ్లలో కూడా పోలీసులను సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ప్రగతి భవన్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.