తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజ‌ర‌య్యే క్రేజీ మ్యారేజ్‌

279

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, కేసీఆర్ చాలా స‌ఖ్య‌త‌తో మెలుగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌ల విష‌యంలో వీరు ఒక అవ‌గాహ‌న‌తో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే వీరుద్ద‌రు ఎప్పుడు మీట్ అయినా అది ఓ సంచ‌ల‌నం అవుతోంది. తాజాగా వీరిద్ద‌రు క‌లిసి త్వ‌ర‌లోనే ఓ క్రేజీ మ్యారేజ్‌కు హాజ‌రు కానుండ‌డం కాస్త ట్రెండింగ్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర యువ పోలీస్ అధికారుల్లో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే.

గ‌తంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్గా ప‌నిచేసిన కాటా ఆమ్ర‌పాలి యువ మ‌హిళా ఐఏఎస్ అధికారిణిగా ఎంత పేరు తెచ్చుకున్నారో ఐపీఎస్ అధికారిణిల్లో చంద‌న దీప్తి కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. త్వ‌ర‌లోనే ఆమె వివాహం హైద‌రాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా ఎస్పీ చందన దీప్తి ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన వివాహానికి రావాలని కోరారు.

medak sp chandana deepthi invites kcr and Jagan for her marraige

అక్టోబర్‌లో జరిగే ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే చంద‌న‌దీప్తికి కాబోయే భ‌ర్త జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి స‌మీప బంధువు. అత‌డు ఏపీలోని జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాకు చెందిన వ్య‌క్తే. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌స్తిస్తోన్న చంద‌న దీప్తికి కాబోయే భ‌ర్త పెళ్లి త‌ర్వాత బిజినెస్ రంగంలో స్థిర‌ప‌డే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మెదక్ ఎస్పీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాను ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని అప్ప‌ట్లో ఆమె చేసిన వ్యాఖ్య‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. ఇక ఆమెకు కాబోయే భ‌ర్త ఏపీ సీఎంకు ద‌గ్గ‌ర బంధువు కావ‌డంతో ఈ మ్యారేజ్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో ఆసక్తి నెల‌కొంది.