ఇండియా నుంచి వెళ్ళిపోయిన రెండు రోజుల తరవాత అసలు విషయం బయటపెట్టిన ట్రంప్ భార్య !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా నుంచి తిరిగి అమెరికాకి వెళ్లిపోయిన రెండు రోజులు తర్వాత ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ భారత పర్యటన గురించి తన మనసులో ఉన్న అసలు విషయం మరియు జ్ఞాపకాలు గురించి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. భారతీయులు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ మర్చిపోలేము అంటూ అద్భుతమైన స్వాగతం లభించింది అని మెలానియా తన పోస్టులో తెలిపింది. Image result for melania trump india

చాలా అద్భుతమైన మర్యాద ఇచ్చారని చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు భారత్ లో మోడీ ఆధ్వర్యంలో లభించిందని మెలానియా తెలిపింది. ఇదే సందర్భంలో సర్వోదయ పాఠశాల సంఘర్షణ గురించి అదేవిధంగా భారతీయ సాంప్రదాయం ప్రతిబింబించేలా చిన్నారులు పలికిన స్వాగతం గురించి అదే స్థాయిలో పాఠశాలలో పిల్లలతో గడిపిన క్షణాల గురించి మెలానియా ఈ విధంగా తన ప్రేమను చాటుకున్నారు.

 

‘భారత సంప్రదాయ పద్ధతి లో నుదుట తిలకం దిద్ది హారతి ద్వారా నాకు స్వాగతం పలికినందుకు సర్వోదయ పాఠశాలకు కృతజ్ఞతలు. అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులు బోధనా సిబ్బంది మధ్య ఉండే అవకాశం రావడం గౌరవం గా భావిస్తున్నాను. పాఠశాలలో గడిపిన క్షణాలన్నీ చిరస్మరణీయం’ అంటూ మెలానియా సర్వోదయ పాఠశాల సందర్శనను గుర్తుచేసుకున్నారు. తల్లి మెలానియా కూతురు ఇవాంక ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ పర్యటన సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇండియా పై తమ ప్రేమను చాటుతున్నారు.