బెజవాడలో ఓవైసీ పెట్టిన చిచ్చు

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు కొన్ని సమస్యలు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇప్పటివరకు విజయవాడ రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు విజయవాడలో పోటీ చేయాలి అని భావించడం తెలుగుదేశం పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్న పరిణామంగా చెప్పుకోవచ్చు.

తాజాగా ఎంఐఎం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి విజయవాడలో ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటి అంటే ఎంఐఎం నుంచి ఇద్దరు అభ్యర్థులు రెండు వార్డులకు పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉంది. జలీల్ ఖాన్ కి ఈ ఓటు బ్యాంకు ఎక్కువగా కలిసి వస్తుంది. ఈ తరుణంలో ఆ రెండో వార్డులలో అభ్యర్థులు పోటీ చేయడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయనే ఆవేదన ఉంది. జనసేన పార్టీ నేతల వద్ద కూడా ఈ ఆవేదన టీడీపీ వ్యక్తం చేసింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో సైలెంట్ గా ఉండాలని కూడా కోరింది. ఈ తరుణంలో ముస్లిం వోటు బ్యాంకు టార్గెట్ చేస్తూ మజ్లిస్ పార్టీ అడుగుపెట్టడంతో తెలుగుదేశం పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. పరోక్షంగా వైసిపికి సహకరించడానికే అసదుద్దీన్ ఓవైసీ తన అభ్యర్థిని రంగంలోకి దించారు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద ఎంత వరకు పడుతుంది అనేది ఎన్నికలు పూర్తి అయితే గాని స్పష్టత రాదు.

Read more RELATED
Recommended to you

Latest news