ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

-

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా…? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి. దీనితో మీరు ఆన్‌లైన్‌ ద్వారానే ఈ సేవలని పొందవచ్చు. ఇక వివరాల లోకి వెళితే… యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా -UIDAI తయారు చేసిన ఎంఆధార్‌ యాప్‌లో దాదాపు 35 రకాల సేవలు పొందవచ్చు.

దీన్ని తాజాగా అప్డేట్ కూడా చేసారు. దీనితో ఇది మరెంత సౌకర్యంగా ఉంటుంది. ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ని డౌన్లోడ్ చేయుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంఆధార్‌ యాప్‌ ఉంది. ఇక సర్వీసుల విషయం లోకి వస్తే.. ఈ యాప్ లో ఐదుగురు ప్రొఫైల్స్ ని యాడ్ చెయ్యొచ్చు. దీనితో ఒకే యాప్ లో ఐదుగురి ఆధార్ నెంబర్స్ ని చేర్చి సేవలని పొందవచ్చు.

ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఆధార్‌ నెంబర్‌ మర్చిపోతే కూడా తిరిగి మీరు ఈజీగా పొంద వచ్చు. ఆధార్‌ రీప్రింట్ కోసం ఆర్డర్‌ చేసుకోవచ్చు. అలానే ఈ యాప్ నుండి రైల్వే స్టేషన్‌లలో, ఇతర ప్రాంతాల్లో ఐడీ ప్రూఫ్‌గా చూపించచ్చు.

అంతే కాదండి సులువుగా చిరునామాను సైతం అప్‌డేట్‌ చేసుకోవచ్చు కూడా. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆధార్‌ కార్డు షేర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లేదా బయోమెట్రిక్స్ లాక్ చేయవచ్చు. ఆధార్ కార్డును ఆఫ్‌లైన్‌ మోడ్‌లో చూడొచ్చు మరియు పేపర్‌లెస్‌ ఇకేవైసీ షేర్‌ చేయవచ్చు. పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబర్‌ లాంటివి కూడా మార్పులు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. డ్యాష్‌ బోర్డు లో ఆధార్‌ అప్‌డేట్‌ స్టేటస్‌, ఆధార్‌ రీప్రింట్ స్టేటస్‌ తెలుసుకోవడం కూడా దీనితో సులభం.

 

Read more RELATED
Recommended to you

Latest news