సీఎం కేసీఆర్‌ హామీలు ఇచ్చినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకొంది: మ‌ంత్రి హ‌రీష్‌రావు

-

ప్రస్తుతానికి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సీఎఫ్‌వో-2019 సదస్సుకు హజరై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా కోలుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఐటీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అలాగే ఇటీవల ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటిస్తుంటే తన గుండె వేగం పెరిగిందని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. ఆర్థికమంత్రిగా నిధుల సేకరణ,ఖర్చుపై తాను కచ్చితంగా వ్యవహరిస్తానన్నారు.

గతంలో సాగునీటి మంత్రిగా ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేశానన్నారు. ప్రభుత్వంలో తన పాత్ర సీఎఫ్‌వో(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) లాంటిదని అన్నారు. సీఎం కేసీఆర్ నేత్రుత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. అదే విధంగా.. దేశ ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు అవసరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news