ఎలక్షన్ డబ్బులు కోసమే సోమిరెడ్డి డ్రామా.. సత్యాగ్రహ దీక్షపై మంత్రి కాకాని స్ట్రాంగ్ కౌంటర్..

-

సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్ష వెనక ఎన్నికల స్టంట్ ఉందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.. వ్యాపారులను బెదిరించడం వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే సోమిరెడ్డి పనిని ఆయన ధ్వజమెత్తారు.. ఇంతకీ సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు కారణం ఏంటి..?

నెల్లూరు జిల్లా..పొదలకురు మండలం తాటిపర్తి లోని రుస్తుం, భారత్ మైకా మైన్ ప్రాంతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి రెండు రోజుల నుంచి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు మద్దతు తెలిపారు..ఎటు వంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అధికార పార్టి విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని సోమిరెడ్డి ఆరోపించారు.. వైసీపీ బందిపోటు దొంగలు 21 రోజులు గా రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను వెలికితీసి అక్రమంగా రోజు కు 4 కోట్ల రూపాయల మేర భారీ దోపిడీ చేస్తున్నట్టు మాజీమంత్రి ఆరోపించారు..కోర్టు జోక్యం చేసుకొని అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకొమని ఈనెల 7 వ తేదినా ఆర్డర్స్ ఇచ్చినా, ఇంత వరకు అధికారులు అక్రమ మైనింగ్ ఆపకపోవడం సిగ్గుచేటన్నారు..

ముఖ్యమంత్రి కి,మంత్రులకు ఇందులో వాటాలు వున్నాయి కాబట్టే మైన్స్, పోలీసులు అధికారులు ముందుకు రావడం లేదని,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏ1 ముద్దాయి అని,పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏ2 గా ఉన్నారని అయన సంచలన ఆరోపణలు చేసారు..

మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు.. ధర్నాలు ఆందోళనలు చేసి వ్యాపారాలను బెదిరించడం డబ్బులు డిమాండ్ చేయడం సోమిరెడ్డికి అలవాటైపోయిందని ధ్వజమెత్తారు.. సోమిరెడ్డి వి నీచ రాజకీయాలని… ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫండింగ్ కోసమే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోమిరెడ్డి చేస్తున్న దొంగ దీక్షలపై నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతానని ముందే గ్రహించిన సోమిరెడ్డి… తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాకాని సమాధానం ఇచ్చారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version