బ్రేకింగ్:మంత్రి కేటిఆర్ గుడ్ న్యూస్…!

టిఎస్ బీ పాస్ లో ముఖ్యాంశాలను మంత్రి కేటిఅర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ ప్లాట్లలోని అన్ని లేఅవుట్లు / భవనాలకు మరియు 21 రోజుల్లోపు 10 మీటర్ల ఎత్తుకు సింగిల్ విండో అనుమతి అని పేర్కొన్నారు. స్వీయ ధృవీకరణ ఆధారంగా ఆమోదం ఉంటుందని స్పష్టం చేసారు. చాలా ఈజీగా నమోదు చేసుకునే విధంగా కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పారు.

75 చదరపు గజాల వరకు మరియు 7 మీటర్ల ఎత్తుతో ప్లాట్లలో నివాస భవనాలకు అనుమతి అవసరం లేదన్నారు. స్వీయ ధృవీకరణ ఆధారంగా 75 చదరపు గజాల పైన మరియు 600 చదరపు గజాల (10 మీటర్ల ఎత్తు వరకు) ప్లాట్లలో నివాస భవనాలకు తక్షణ అనుమతి అని స్పష్టం చేసారు. సింగిల్ రూఫ్ కింద అవసరమైన లైన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసిలు అని పేర్కొన్నారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్ లెవల్ టీఎస్ బీ పాస్ కమిటీ ఉంటుందని అన్నారు.