ట్విట్టర్ లో కేటీఆర్ లైవ్.. మీ ప్రశ్నలకు జవాబులిస్తారు..!

-

ఇది ఎన్నికల సమయం. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం నడస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ గురించి ప్రచారం చేయడానికి పూనుకున్నారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి పై ఎటువంటి సందేహాలు ఉన్నా.. కేటీఆర్ ను ఏదైనా అడగాలనుకున్నా.. ఏదైనా చెప్పాలనుకున్నా.. సలహాలు.. సూచనలు.. ప్రశ్నలు.. ఇలా ఏదైనా కానీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను అడగొచ్చు. దాని కోసం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు.

రేపు అనగా 4 అక్టోబర్ 2018 న సాయంత్రం 5 గంటల నుంచి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో లైవ్ లో ఉంటారు. అప్పుడు మంత్రి కేటీఆర్ ను ఎటువంటి ప్రశ్న అయినా అడగొచ్చు. కాకపోతే AskKTR అనే హ్యాష్ టాగ్ తో కేటీఆర్ పై ప్రశ్నలు సంధించవచ్చు. మరి.. మీరు రెడీయా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version