తనకు గన్ లైసెన్స్ ఇవ్వండని… ఒక్కడినే తిరుగుతా అని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ అనడం సంచలనంగా మారింది. ద్విచక్ర వాహనం పై తిరుగొద్దు అంటూ పోలీస్ లు నాకు సూచించారని… నా నియోజకవర్గం మొత్తం చిన్న , చిన్న వీధులు..నా బుల్లెట్ పై తిరుగకుంటే ప్రజలకు దూరం అవుతా అని ఆవేదన వ్యక్తం చేసారు. పోలీస్ లు నాకు వెపన్ లైసెన్స్ ఇవ్వమంటే ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.
అసలు నాకు ఎవరినుంచి ముప్పు ఉందొ చెప్పాలని కోరారు. పోలీస్ లు భద్రతను పెంచితే స్వాగతిస్తాను..గతం లో కూడా నన్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ వెహికల్ లో వెళితే …మళ్ళీ ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ ఉండదని అది ఎప్పుడు రిపేర్ వస్తుందో తెలియదని అన్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.