అభివృద్ధికి అడ్డొస్తే.. దేన్నయినా తొలగిస్తామంటున్న ఎమ్మెల్యే రోజా..

-

శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని అన్నారు. అలాగే మ‌రోవైపు లోకేష్‌పై కూడా సెటైర్లు పేట్చారు. “ఈరోజు లోకేశ్ తీరు చూస్తుంటే, చాలా విచిత్రంగా అనిపిస్తోంది. బయటకు వచ్చి, ఏదో సాధించేసినట్టు… శాసనమండలిని రద్దు చేస్తారా? దమ్ముంటే చేయండి అంటున్నారు. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడగొడితే ఏమవుతుందండీ? కోసి ఉప్పూ, కారం పెట్టి, కూర వండేస్తారు. ఆ విషయాన్ని లోకేశ్ తెలుసుకుంటే మంచిద‌ని రోజా వ్యాఖ్యానించారు.

అలాగే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుపై కూడా ఈమె ద్వ‌జ‌మెత్తారు. ఇక చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే ఉద్యమాన్ని లేవదీశారని అన్నారు. అంతేకాకుండా.. ప్రజలు అత్యధిక మెజారిటీని ఇచ్చి, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని స్థాపించి కూడా, అభివృద్ధి పరమైన నిర్ణయాలను అమలు చేయలేకపోతే ఎలాగని రోజా ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుతగిలే దేన్నయినా, పక్కకు తప్పించాల్సిందేనని వ్యాఖ్యానించారు. శాసనమండలి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారికి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, వారింకా అదే పద్ధతిలో వెళుతున్నారని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news