మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్లు ఉంటే చాలు. దానికి ఎమ్మెల్యేలు ఎందుకు. అందుకే నేను ఆ కార్యక్రమానికి వెళ్లలేదు..
ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గురించే చర్చ. ఆమెకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదు. ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవి రావాలి కదా. జగన్ ఆమెను ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటూ ఒకటే చర్చలు. తర్వాత ఆమె అలగడం… జగన్ దాన్ని గమనించి తనకు వేరే పదవిని కట్టబెట్టడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది.
ఇవాళ విజయవాడకు వచ్చిన రోజా… మీడియాతో మాట్లాడుతూ తనకు ఎందుకు మంత్రి పదవి దక్కలేదో చెప్పారు. తనను విజయవాడకు రావాలని ఎవ్వరూ పిలవలేదని.. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకే విజయవాడ వచ్చానని తెలిపారు. తనకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఎవ్వరూ చెప్పలేదన్నారు.
నాకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదు. మంత్రి పదవి రాకపోవడంతో నేను అలిగానని చెప్పడం కేవలం మీడియా సృష్టి మాత్రమే. కులాల సమీకరణల వల్లే నాకు మంత్రి పదవి దక్కలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల లిస్టులో నేను ఫిట్ అవలేదు. చిన్నపటి నుంచి నేను కులాల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. అని రోజా అన్నారు.
అందుకే మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాలేదు..
మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికీ శుభాకాంక్షలు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్లు ఉంటే చాలు. దానికి ఎమ్మెల్యేలు ఎందుకు. అందుకే నేను ఆ కార్యక్రమానికి వెళ్లలేదు.. అని రోజా తెలిపారు.