అత్యధికంగా నామినేషన్ల ఉపసంహరణ అక్కడే

-

దేశవ్యాప్తంగా 7విడతల్లో జరగనున్న లోకసభ ఎన్నికల్లో భాగంగా 4వ దశలో మే 13న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఓటింగ్ విధానం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 18నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 25తో ముగయాగా.. అనంతరం జరిగే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, విత్ డ్రా గడువు ఏప్రిల్ 29తో పూర్తయింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

తెలంగాణలో మే 13న కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ 17లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించగా.. 622మంది అభ్యర్థులను ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్లో 77 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఈసీ తిరస్కరించింది.

అయితే ఉపసంహరణ గడువు ముగిసేసరికి మరో వంద మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ తుది ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 15 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకోగా, అత్యల్పంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్కరు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో 12 మంది, నల్గొండ మెదక్ లలో 9 మంది, పెద్దపల్లి, జహీరాబాద్ ఏడుగురు, ఖమ్మం వరంగల్ ఆరుగురు, కరీంనగర్ ఐదుగురు, మహబూబ్‌నగర్‌లో నలుగురు, నిజామాబాద్ చేవెళ్లాలో ముగ్గురు. నాగర్ కర్నూల్ మహబూబాబాద్‌లలో ఇద్దరు, సికింద్రాబాద్ ఆదిలాబాద్‌లో ఒక్కరి చొప్పున తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు పేర్కొన్నారు.

ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో 12 మంది, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 42 మంది, కరీంనగర్ ఎంపీ బరిలో 28 మంది, నిజామాబాద్ ఎంపీ బరిలో 29 మంది, జహీరాబాద్ పార్లమెంటు బరిలో 19 మంది, మెదక్ పార్లమెంట్ పరిధిలో 44 మంది, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో 22 మంది, సికింద్రాబాద్ బరిలో 45 మంది, హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 30 మంది, చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల బరిలో 43 మంది, మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో 31 మంది, నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో 19 మంది, నల్గొండ ఎంపీ బరిలో 22 మంది, భువనగిరి ఎంపీ బరిలో 39 మంది, వరంగల్ ఎంపీ బరిలో 42 మంది, మహబూబాబాద్ బరిలో 23 మంది, ఖమ్మం బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్.

మరోవైపు అత్యధికంగా నామినేషన్ల ఉపసంహారించుకోవడంతో పాటు, అత్యధికంగా 77 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఈసీ తిరస్కరించడంతో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం ఇప్పడు హాట్ టాపిక్‌గా నిలిచింది. దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news