దేవ‌ర‌యంజాల్ భూముల‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దేవ‌ర‌యంజాల్ భూములను టీఆర్‌ ఎస్ నేత‌లు క‌బ్జా చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్ రెడ్డి మ‌రో స‌వాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న దేవరయాంజాల్‌ భూములను ప‌రిశీలించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌రావు శ్రీని డెవలపర్స్‌ పేరుతో భూముల‌ను వెంచ‌ర్ చేశారిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 657 సర్వే నెంబర్‌లో మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ క‌ట్టుకున్నార‌ని ఆరోపించారు. ఇక ఈ భూముల వ్య‌వ‌హారంపై సీబీఐతో ఎంక్వ‌యిరీ జ‌రిపాలంటూ డిమాండ్ చేశారు.

ఇక త‌న‌మీద ఆరోప‌ణ‌లు చేస్తున్న టీఆర్ ఎస్ నాయ‌కులు.. ద‌మ్ముంటే నిరూపిచాల‌ని స‌వాల్ విసిరారు. దేవ‌ర‌యంజాల్ భూముల్లో కేటీఆర్ స‌న్నిహితుడు శ్రీధ‌ర్‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాలంటూ కోరారు. టీఆర్ ఎస్ ముఖ్య నేత‌లంతా ఆల‌య భూముల కబ్జాల్లో ఉన్నార‌ని ఆరోపించారు. ఇక 437స‌ర్వే భూముల వివ‌రాల‌ను మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కు ఫోన్ చేసి అడిగారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తాన‌ని, ద‌ర్యాప్తు స్పీడ్ గా జ‌ర‌పాల‌ని కోరారు.