మునుగోడు పోరు: మారుతున్న సీన్..!

-

మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలని ఆకర్షిస్తున్న అంశం..ఆ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార టీఆర్ఎస్ కసితో పనిచేస్తుంది..ఎలాగో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ చేతులో చావుదెబ్బతింది..కానీ ఈ సారి మాత్రం బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని టీఆర్ఎస్ చూస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..కాలుకు బలపం కట్టుకుని మరీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

ఈ రెండు పార్టీలు ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అన్నట్లు ఉంది…ఎందుకంటే బీజేపీ కంటే తెలంగాణలో బలంగా ఉన్నా సరే కాంగ్రెస్ ఇప్పటివరకు ఏ ఎన్నికలో సత్తా చాటలేదు. అందుకే ఈ సారి మునుగోడులో మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ పనిచేస్తుంది. గతానికి భిన్నంగా తొందరగానే అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా పెట్టారు. ఆమెకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సీటు ఆశించి భంగపడ్డ నేతలు..చల్లమల్ల కృష్ణా రెడ్డి, కైలాష్ నేతలు…పూర్తి గా అసంతృప్తి వ్యక్తం చేయకుండా…కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.

అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మునుగోడులో ప్రచారానికి రెడీ అవుతున్నారు..ఇక రాష్ట్ర స్థాయి నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ సారి కాంగ్రెస్ నేతలు ఏకమై…మునుగోడులో పార్టీ కోసం పనిచేసేలా ఉన్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇక బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి మద్ధతుగా మునుగోడుకు రానున్నారు.

కాకపోతే దుబ్బాక, హుజూరాబాద్ అంత జోష్ మునుగోడులో లేదు. బీజేపీ కాస్త చప్పగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అటు టీఆర్ఎస్ పార్టీకి మంచి ఊపు ఉంది గాని..ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. అభ్యర్ధిగా ప్రచారం అవుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు టీఆర్ఎస్ నేతలు నిలుస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్ధులు రెడీ అయిన సరే టీఆర్ఎస్ ఇంకా అభ్యర్ధిని ఫిక్స్ చేసుకోలేకపోతుంది. మొత్తానికి మునుగోడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version