టీడీపీకి బిగ్ షాక్‌.. మ‌రో కీల‌క నేత వైసీపీ ఎంట్రీ ఫిక్స్‌..

టీడీపీలో ఇంతకుముందు కీలకంగా వ్యవహరించిన డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్యాల రత్నం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఉండి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ముత్యాలరత్నంకు మంచి పట్టు ఉంది. అలాగే మంత్రి పేర్ని నానికి, రత్నం కుటుంబానికి మంచి సంబంధాలు ఉండడం, ఉండి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై మంచి పట్టు ఉండడంతో ఆయనను పార్టీలోకి రావాలంటూ వైసీపీ నేతలు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఈ నెల 14న ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా రత్నంతోపాటు మరికొందరు నేతలు ఆయన సమక్షంలో వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే, జగన్ పర్యటన ఆ తర్వాత రద్దు కావడంతో నేరుగా సీఎం క్యాంపు కార్యాలయంలోనే చేరికలు ఉంటాయని స‌మాచారం.