ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని చెబుతున్న వారికి నాగన్న సర్వే షాక్ ఇచ్చింది.. 2019 ఎన్నికల్లో మాదిరి వన్ సైడ్ వార్ ఉంటుందని స్పష్టం చేసింది.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన నాగన్న సర్వే టీం విశ్లేషణాత్మకంగా వివరాలు వెల్లడించింది.. ఏ వర్గం ఎవరి వైపు ఉంది..? గ్రామీణ ప్రాంతాలలో ఏ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుంది..? వాలంటీర్ల ప్రభావం ఏ పార్టీపై ఉంటుంది..? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశాలను కులంకుశంగా వివరించింది.. జనసేన కార్యకర్తల్లో ఉండే అసంతృప్తిని సైతం సర్వే చేసి ఏపీ ప్రజల ముందుంచింది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 నుంచి 130 స్థానాలను కైవసం చేసుకుంటుందని నాగన్న సర్వే కుండ బద్దలు కొట్టింది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 103 స్థానాలలో వైసిపి.. 39 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని స్పష్టం చేసింది.. మిగిలిన 33 స్థానాల్లో తీవ్ర పోటీ ఉంటుందని.. అందులో కూడా 20 నుంచి 25 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని తమ సర్వేను వెల్లడించింది.. 20 నుంచి 21 పార్లమెంటు స్థానాలను సైతం జగన్ గెలుచుకోబోతున్నారని స్పష్టం చేసింది.. ఆంధ్రప్రదేశ్లో సుమారు 60 శాతం మంది మహిళలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారట. ఇటీవల జరిగిన వాలంటీర్ల రచ్చ కూడా తెలుగుదేశం పార్టీ కొంప ముంచబోతుందని సర్వే స్పష్టం చేసింది.. వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పెన్షన్ దారులందరూ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంతో ఉన్నారని సర్వే వెల్లడించింది..
టిడిపి జనసేనతో బిజెపి జత కట్టడంతో మైనార్టీ లందరూ ఆ పార్టీకి దూరమై… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని నాగన్న సర్వే తెలిపింది.. బీసీ వర్గాలలో మెజారిటీ ఓట్లు వైసీపీకే పడతాయంటూ లెక్కలతో సహా వివరించింది.. గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువకులందరూ సీఎం జగన్ వైపే ఉన్నారని, గ్రామాల అభివృద్ధి, నాడు నేడు వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి దగ్గరయ్యారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందంటూ వస్తున్న ప్రచారాల్ని నాగన్న సర్వే తిప్పి కొట్టింది.. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే వైసీపీకే లాభం అంటూ వివరించింది..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోవడం, ఆయన్ని కేవలం 21 స్థానాలకే పరిమితం చేయడంతో జనసేన కేడర్ కూడా నిరాశలో ఉందని రిపోర్టు స్పష్టం చేసింది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ప్రజల్లో ఆ పార్టీ పైన మరింత ఇమేజ్ పెరిగే అవకాశం ఉందని.. గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు మేధావులు సైతం మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వివరించింది.. మొత్తంగా చూసుకుంటే ఏ ఒక్క విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మూడు పార్టీలు టచ్ కూడా చేయలేవని, 120 నుంచి 130 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయం అని సర్వే వెల్లడించింది..