సీఎం రేవంత్ పై కయ్యానికి కాలుదువ్వుతున్న నల్గొండ సీనియర్లు.. కారణం అదేనా..?

-

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్ నేతలు అసంతృప్తులు వెళ్లగక్కుతూనే ఉన్నారు.. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదన సమయం చిక్కినప్పుడల్లా వినిపిస్తూనే ఉన్నారు. వలస నేతలకు పదవులు కట్టబెట్టి తమను అవమానపరుస్తున్నారనే టాక్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినిపిస్తోంది..

ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హేమాహేమీలకు కేరాఫ్ అడ్రస్.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డిలు ఇక్కడి నుంచే రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎవరికి వారే సొంత గ్రూపులతో రాజకీయాలు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్లైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇలాంటి జిల్లాలో రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బంధువు కావడంతో ఆయనకు రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ పదవి వరించింది.. ఈ పదవే కాంగ్రెస్ లో చిచ్చు రగిల్చిందట.. తమ బంధువులకు, సన్నిహితులకు సీఎం రేవంత్ రెడ్డి పదవులు కట్టబెడుతున్నారని సీనియర్లు మండిపడుతున్నారట..

కాంగ్రెస్ లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని గుత్తా అమిత్.. కీలక పదవి ఇవ్వడంపై ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడితే.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డులు తమకు సన్నిహితంగా ఉండేవారికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే కోరారట.. వారికి కాదని అమిత్ కు పదవిరావడంపై వారు కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news