నామినెటెడ్ పదవుల రెండో లిస్ట్ కోసం నేతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. తమకు ఈసారైనా అవకాశం దక్కుతుందా లేదా అంటూ లెక్కలేసుకుంటున్నారు.. ఈ క్రమంలో రెండో లిస్ట్ పై చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు.. సీనియర్ నేతలతో పాటు.. ఈసారి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది..
మొదటి జాబితాలో 99 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన చంద్రబాబు… సెకండ్ లిస్ట్‌పై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీపావళిలోపే రెండో లిస్ట్ ను విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే రెండో లిస్ట్ పై టీడీపీలో కొన్ని ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.. సీనియర్ మహిళలతో పాటు.. జనసేన, బీజేపీ నేతలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని తెలుస్తోంది..
మొదటి లిస్ట్ లో టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, అలాగే బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. అయితే రెండో లిస్ట్ లో మాత్రం ఈ రెండు పార్టీలకే ఎక్కువ పదవులు రాబోతున్నాయని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.. అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవులతో పాటు.. టీటీడీ చైర్మన్ , పాలకమండలి సభ్యుల పదవులను భర్తీ చెయ్యబోతున్నారని ఇప్పటికే టీడీపీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది.. వాటిని చేజిక్కించుకునేందుకు సీనియర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.. అయితే ఎంతమందితో రెండో జాబితా విడుదల అవుతుందో.. ఎవరెవరికి పదవులు వరిస్తాయో చూడాలి..