లోకేషాలు మాన‌డా…!!

-

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ట‌ర్ పోస్టు చూస్తుంటే మీకు ఏమి గుర్తుకొస్తుంది… ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏమీ గుర్తుకొస్తుందో రాదో తెలియ‌దు కానీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మాత్రం బ‌షీర్‌బాగ్ సంఘ‌ట‌న గుర్తుకొస్తుంది. మ‌రి లోకేష్ పెట్టిన ట్వీట్ కు, బ‌షీర్‌బాగ్ సంఘ‌ట‌న‌కు లింకేంది అనే క‌దా మీ డౌట్‌… అది చూద్దాం.. నారా లోకేష్ కొద్ది సేప‌టి క్రితం ఓ ట్వీట్ట‌ర్లో ఓ రెండు పోస్టులు పెట్టాడు. అందులో ఓ పోస్టులో రైతులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఎక్కి కూచున్న రైతుల ఫోటోలు. ఈ ఫోటోల‌ను బేస్ చేసుకుని ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశాడు నారా లోకేష్‌.

అసలే మీరొచ్చాక వానల్లేక పొలాలు ఎండిపోతున్నాయి. చేనుకు ఆధారంగా ఉన్న బోరును కూడా మీ పార్టీ వాళ్ళు ధ్వంసం చేస్తే ఆ రైతు ఎలా బతకాలి? ప్రాణానికే ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ ఎక్కాడంటే ఈ రైతును మీ పార్టీ వాళ్ళు ఎంత హింసిస్తున్నారో చూడండి. ముఖ్యమంత్రిగా ఈ ఘటనపై వెంటనే స్పందించండి. అంటూ ఓ పోస్టు చేసిన లోకేష్ మ‌రో పోస్టును ఇలా చేశాడు.

సీఎం జ‌గ‌న్ గారూ!  మీరు ముఖ్యమంత్రి అయ్యారని, రాష్ట్ర ప్రజలందరి బాగోగులకి మీరే జవాబుదారీ అని మీ వైసీపీ రౌడీలకి ఇంకా తెలిసిరావడం లేదు. అందుకే మీ దౌర్జన్యాలను రాష్ట్రమంతా కొనసాగిస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు ప్రజల పాలిట చావు కంటే ప్రమాదకరంగా, యమభటుల్లా మారుతున్నారు అంటూ మ‌రో పోస్టును చేశాడు. అయితే ఈ పోస్టును చూసిన జనాల‌కు మాత్రం బషీర్‌బాగ్ సంఘ‌ట‌న గుర్తుకు రాక మాన‌దు.

లోకేష్ తండ్రి మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు క‌రెంటు లోవోల్టేజీ, విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ చేసిన పోరాటంలో రైతుల‌ను కాల్చి చంపిన ఘ‌టన గుర్తుకొచ్చింది. ఆనాడు లోకేష్ తండ్రేమో రైతుల‌ను పిట్ట‌ల్లా కాల్చి చంపాడు.. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో కూర్చోగానే రైతులు గుర్తుకొస్తున్నారు… ఇంత‌కు క‌రెంటు రాక‌పోవ‌డానికి కేవ‌లం రెండునెల‌ల స‌ర్కారు కార‌ణ‌మైతే … ఇంత‌కాలం ప‌నిచేసిన స‌ర్కారు ఎందుకు క‌రెంట్‌ను ఉత్ప‌త్తి చేసే సామార్థ్యం పెంచ‌లేదన్న ప్ర‌శ్న‌కు లోకేశ్ ఆన్స‌ర్ ఇవ్వాలి.

అయితే ఇప్పుడు రైతులు ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఎక్కుతున్నార‌ని పోస్టు చేసిన లోకేషంకు విద్యుత్ సిబ్బంది లేక‌నా.. లేక విద్యుత్ లేక‌నా… లేక ఓ ఊళ్ళో ఉండే కుటుంబ క‌క్ష‌లు కావొచ్చు క‌దా.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు కావొచ్చు క‌దా.. ఇది కూడా రాజ‌కీయ‌మేనా లోకేష్ గారు…

Read more RELATED
Recommended to you

Latest news