హహహ.. లోకేశ్ బాబును మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన ఒక్కసారి తన ప్రతాపాన్ని చూపించారనుకో.. ఎలా ఉంటుందో తెలుసా? దానికి ఉదాహరణే ఆయన గత రాత్రి చేసిన ట్వీట్లు.
ఏకంగా ప్రధాని మోదీనే ఏకిపారేశారు లోకేశ్ బాబు. మామూలుగా కాదు.. ఆ ట్వీట్లలో ఎంత ఆవేశం.. ఎంత కోపం.. ఎంత కసి.. ఆ కసి చూస్తుంటే లోకేశ్ బాబు.. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అవుతారు. ఏమవుతారు అంటారా? ఏమో మాకేం తెలుసు. కానీ.. చినబాబు.. మీరు తప్పుకుండా అవుతారు బాబు గారు.. అవుతారు.
ఇంతకీ ఒక్కసారిగా మోదీపై చినబాబు ఎందుకు విరుచుకుపడ్డారంటావు.. అంటారా? మోదీ ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయన చంద్రబాబు ఆస్తుల గురించి మాట్లాడేసరికి చిన్నబాబుకు తట్టుకోలేనంత కోపం వచ్చింది. వెంటనే మోదీని ఏకిపారేద్దామనుకున్నారు. కానీ.. మైకుల ముందు మాట్లాడి లేనిపోని సమస్యలు ఎందుకురా దేవుడోయ్.. అనుకున్నారో ఏమో. ట్విట్టర్ లో మాత్రం రెచ్చిపోయారు. చంద్రబాబును మోదీ బాహుబలి సినిమాలోని భళ్లాలదేవతో పోల్చితే.. చినబాబు ఏమన్నా తక్కువ తిన్నారా? మోదీనే భళ్లాలదేవ, కాలకేయతో పోల్చారు. అంతే కాదు.. తన తండ్రి చంద్రబాబును బాహుబలితో పోల్చుకున్నారు. అబ్బ.. ఎంత ప్రేమ తండ్రిపై. కొడుకంటే లోకేశ్ బాబులా ఉండాలప్పా? ఏమంటారు. నిజంగా చంద్రబాబు అదృష్టవంతుడు.. లోకేశ్ లాంటి కొడుకు ఉన్నందుకు. ఇక.. మీ సోది ఆపి లోకేశ్ ఏం ట్వీట్లు చేశారో చెప్పండి.. అంటారా? చూసేయండి…
ఏపీకి ప్రత్యేకహోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు @narendramodi గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి @ncbn గారు#ModiIsAMistake
— Lokesh Nara (@naralokesh) April 1, 2019
ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబున్నారు.
హెరిటేజ్ సంస్థని చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరిగారు ఉన్నారు
జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి మోడీ గారు చౌకీదార్‌గా మారారు.— Lokesh Nara (@naralokesh) April 1, 2019
54 వేల కోట్లయ్యే #పోలవరం ప్రాజెక్ట్‌కి 6 వేలకోట్లిచ్చి పూర్తిచేయలేదంటున్నారు.
మీకు లెక్కలు రావా? ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా?గుజరాత్లో నరమేథం సాగించిన నరేంద్ర మోడీ గారూ!
అరివీర భయంకరులైన మీరు భళ్లాల దేవుడికి సరిసాటి.
కాలకేయుడికి మీరే పోటీ!— Lokesh Nara (@naralokesh) April 1, 2019