కాలినడకన తిరుమల వెళ్లిన సమంత..!

-

అక్కినేని కోడలు సమంత తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల ద్వారా కాలినడకన వెళ్లడం జరిగింది. మజిలీ టీం ఈరోజు శ్రీవారిని దర్శనార్ధం సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అయితే టీం అంతా కొండపైకి కారులో వెళ్లగా సమంత మాత్రం కాలినడకన తిరుమల కొండ ఎక్కారు. సాయంత్రం మొదలు పెట్టిన సమంత కాలినడక రాత్రి 10 గంటలకు కొండపైకి చేరుకున్నారని తెలుస్తుంది. కాలినడక మధ్యలో తన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సమంత తన కాలినడక యాత్రం కొనసాగించింది.

ఇక సినిమా విషయానికి వస్తే నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పెళ్లి తర్వాత చైతు, సమంత నటించిన సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తిరుపతిలో దర్శనం చేసుకుని అక్కడ ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న చైతుకి మజిలీతో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తుంది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news