ట్రంప్ ఇండియా పర్యటనపై నెటిజన్ల మండిపాటు.. ఎందుకో తెలుసా..?

-

ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇండియాకు రానున్న సందర్భంగా భార‌త్‌లో తెగ‌ హడావుడి జ‌రుగుతోంది. సతీమణి మెలనియా ట్రంప్‌తో కలిసి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో అహ్మాదాబాద్‌లో ల్యాండవుతారు మిస్టర్‌ ప్రెసిడెంట్‌. అయితే ట్రంప్ ఇండియా ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్’ కార్యక్రమం జరిగే మోతేరా స్టేడియం వరకు రోడ్డు షో ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులో దాదాపు 70 లక్షల మంది జనం తనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారని వాషింగ్టన్ లో ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

అహ్మాదాబాద్ జనాభానే 50 నుంచి 55 లక్షల మధ్య ఉంటే 70 లక్షల మంది ఎలాగొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సభలా స్వాగతానికి కూడా జన సమీకరణ చేస్తారా?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అదేవిధంగా అంతమందితో స్వాగతం పలకడానికి ఆయనేమైనా దేవుడా? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడి పర్యటనపై అంత హడావుడి దేనికని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు ట్రంప్ వెళ్లే మార్గంలో పేదల మురికివాడలు ఆయనకు కనబడకుండా 4 అడుగుల ఎత్తయిన గోడను కట్టేశారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాల మీద ఈ పని కానిచ్చారు. ఈ విష‌యం కూడా విమర్శలకు, సెటైర్లకు దారి తీస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news