ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికైన నాటినుండి పాదయాత్రలో, ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అదే తరుణంలో ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా చెక్ పెట్టే రాజకీయాన్ని చేసుకుంటూ దూసుకుపోతున్న జగన్ కి అన్ని విధాలా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పరిపాలనపై కొంత సానుకూలంగానే ఉన్నారు.
ముఖ్యంగా ‘అమ్మఒడి’ మరియు ‘రైతు భరోసా’ కార్యక్రమాలతో ఏపీ రాష్ట్ర ప్రజల హృదయాలను కొల్లగొట్టాడు జగన్. ఇదే తరుణంలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకువచ్చి ప్రజల మనసులలో మరింత స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రజల్లో జగన్ పై ఉన్న చిన్నపాటి వ్యతిరేకత విషయాన్ని టార్గెట్ గా స్థానిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
క్లియర్ గా విషయంలోకి వెళ్తే జగన్ పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ విషయంలో సానుకూలంగా ఉన్న ప్రజలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ అటు ఇటు గా ప్రస్తుతం వ్యవహరిస్తుండటంతో ఈ ఒక్కటంటే ఒక్క విషయంలో మాత్రమే వైయస్ జగన్ పై ఏపీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రత్యేక హోదా విషయాన్ని టార్గెట్ గా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు…జగన్ సర్కార్ నీ ఎండగట్టాలని వ్యూహాలు వేస్తున్నట్లు సమాచారం.