ఈ టైమ్ లో కరోనా మీద సినిమా ఏంటి సామీ .. ఆపండి మీ వెర్రి !

-

భూమి మీద మనిషి జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మార్చేసింది కరోనా వైరస్. ప్రపంచాన్ని భయపెట్టింది అతిపెద్ద ప్రమాదకరమైన వైరస్ గా చాలా దేశాలలో మరణ విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ వల్ల చాలా మంది ప్రపంచంలో కొన్ని వేల మంది చనిపోగా..లక్షల మంది శరీరాలను తన వశం చేసుకుంది. ప్రపంచంలో ప్రతి మనిషి ఎంతో ప్రభావితం చేసిన ఈ కరోనా వైరస్ నీ క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు రెడీ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కరోనా ప్యార్ హాయ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.SARS-CoV-2: Still More Questions than Answersఅంతేకాకుండా దానికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా నిర్మాణ సంస్థ వదిలింది. అలాగే అనేక సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ పై చాలా మంది నిర్మాతలు సినిమా తెరకెక్కించడానికి పలు టైటిల్స్ రిజిస్టర్ చేస్తున్నారు. ఆల్రెడీ కెనడియన్-పర్షియన్ ఫిలింమేకర్ ముస్తఫా కేశ్వరి ‘కరోనా’ అని ఒక సినిమా తీశారు.ఫియర్ ఈజ్ ది వైరస్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. సస్పెన్స్ డ్రామాగా సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా మొత్తం సింగిల్ షాట్ లోనే చిత్రీకరించినట్లు సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది.

అపార్ట్ మెంట్ లో ఏడుగురు ఇతర ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో చైనా మూలాలు కలిగిన వ్యక్తి లిఫ్ట్‌లో వైరస్ గురించి మాట్లాడుతున్న సమయంలో జాత్యహంకార ధోరణితో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది చాలా వెండితెరపై చూడాల్సిందే అని అంటున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఏంటి స్వామి ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే ఈ టైంలో కరోనా మీద సినిమా అంటూ ఆపండి మీ వెర్రి ఐడియాలు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news