ఒంగోలు వైసీపీకి కొత్త సారధి.. క్యాడర్ ను ఏకం చేస్తారా..?

-

పార్టీ ఓడిపోవడంతో.. కీలక నేతలందరూ తలో దారి చూసుకుంటున్నారు.. పార్టీలో పదవులు అనుభవించి.. ఓడిన తర్వాత భవిష్యత్ కోసం పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు.. వెళ్లిన వారి స్థానంలో కొత్తవారికి వైసీపీ అధినేత జగన్ అవకాశం ఇస్తున్నారు.. జిల్లా అధ్యక్షులతో పాటు.. ఇన్చార్జులను కూడా మార్చేసి.. పార్టీబలోపేతం పై జగన్ దృష్టి పెడుతున్నారు.. ఈ క్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జిగా రవిని తెరమీదకు తీసుకొచ్చారు జగన్..

ప్రకాశం జిల్లాలో దశాబ్దానికి పైగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. తనవర్గంతో కలిసి జనసేనలో చేరారు.. దీంతో ఆ స్థానంలో సరైన నేత కోసం వైసీపీ కసరత్తు ప్రారంభించింది.. క్యాడర్ కు భరోసా ఇవ్వడంతో పాటు.. పార్టీని బలోపేతం చేసే నేతకోసం అన్వేషించింది.. చివరికి వైవీ సుబ్బారెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న రవిని ఇన్చార్జిగా ప్రకటించింది..

జగన్ కు బాబాయ్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి రవి ప్రధాన అనుచరుడు.. పార్టీ పట్ల విధేయతతో ఉంటారు.. దీంతో ఆయనికి ఇన్చార్జి ఇవ్వాలంటూ వైవీ సుబ్బారెడ్డి రికమెండ్ చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఆయన ఆశీస్సులతో రవి ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటి నుంచే అస్సలు కథ మొదలవుతుందని రాజకీయవర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి..

వైసీపీకి ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు పెద్ద దిక్కు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన ఆయన.. అప్పట్లో జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే 2019,2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ ఆయనకు అప్పగించారట.. దీంతో తన అనుచరుడుగా ఉన్న రవికి ఇన్చార్జి ఇప్పించుకుని.. పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో వైవీ ఉన్నట్లు తెలుస్తోంది.. బాలినేని ఇలాకాలో వైవీ సుబ్బారెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తారో… క్యాడర్ ను ఎలా ఏకతాటిమీదకు తీసుకొస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news