నా భార్య ఆరోగ్యం సరిగ్గా లేదు : మంచు మనోజ్

-

మంచు ఫ్యామిలీ వివాదం సినిమా మాదిరి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. మంచు మనోజ్ ను కొట్టడంతో మొదలైన ఈ సినిమాకు గత రెండు రోజులు ఇంట్రవెల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్ళీ మొదలైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే ఎక్కువ ట్విస్ట్ లతో సాగుతుంది అనే చెప్పాలి. అయితే నిన్న మంచు మనోజ్ తల్లి భార్య బర్త్‌డే పార్టీ జరుగుతుండగా కరెంట్‌ పోయింది. ఉదయం చూడగా జనరేటర్‌లో పంచదార పోసినట్లు గుర్తించారు. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోసినట్లు సీసీ కెమెరాలో బయట పడింది.

ఇక ఆ సీసీ కెమెరాలో మంచు విష్ణు కూడా కనిపించడంతో.. అన్న పై మంచు మనోజ్ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ కథలో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు మంచు మనోజ్. ఈ ఘటన పై రేపు ఉదయం ఫిర్యాదు చేస్తానంటున్నాడు మంచు మనోజ్. ఈ ఘటన తో కుటుంబ సభ్యులు భయాందోళన కి గురయ్యారు. అలాగే మా భార్య ఆరోగ్యం సరిగ్గా లేదు. దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను బయటకు రాలేకపోతున్నా. రేపు ఉదయం ఫిర్యాదు చేస్తా అని మనోజ్ పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news