కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. రాధా ఎప్పుడో 2004లోనే రాజకీయాల్లోకి వచ్చిన ఇంతవరకు పెద్దగా సెట్ కాలేకపోయారు. అప్పుడు మాత్రం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా….మళ్ళీ గెలవలేదు. ఎన్ని పార్టీలు మారినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి టీడీపీలోకి వచ్చి సెట్ అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది.
దీంతో పోలిటికల్ సీన్ ఒక్కసారిగా మారింది..పైగా రాధా, చంద్రబాబు డైరక్షన్‌లో రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీని బట్టి చూస్తే రాధా ఇంకా టీడీపీలోనే సెట్ అయ్యారని అర్ధమవుతుంది. ఆయన అసలు టీడీపీ కోసం బ్యాగ్రౌండ్‌లో గట్టిగానే వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో నెక్స్ట్ టీడీపీ గెలుపు కోసం రాధా కృషి చేస్తారని అర్ధమవుతుంది. కానీ ఆయనకు ఏ సీటు ఇస్తారనే ప్రచారం కూడా వస్తుంది.
ఆయన మొదట నుంచి విజయవాడ సెంట్రల్ మాత్రమే కావాలంటున్నారు. వైసీపీ ఆ సీటు ఇవ్వలేదు కాబట్టే, పార్టీ వీడారు. అయితే టీడీపీలో సీటు ఖాళీ లేదు. ఆ సీటులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు. మరి రాధాకు అదే సీటు ఇవ్వాల్సి వస్తే..బోండా త్యాగం చేయాలి. ఆయనకు వేరే సీటు చూడాలి. మరి చూడాలి రాధాకు సెంట్రల్ సీటు ఫిక్స్ చేస్తారో లేదో?