భారత దేశ ప్రజలు భవిష్యత్ చూడాలంటే ఏప్రిల్ 14 వరకు ఇంటి నుండి బయటకు రాకూడదు అంటూ లాక్‌డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో ప్రజలంతా భయాందోళనలతో ఇళ్ల కే పరిమితమయ్యారు. ఎవరు కూడా ఇంటి నుండి బయటకు రాకపోవడం తో రోడ్లు అన్నీ నిర్మానుష్యం అయ్యాయి. నిత్యావసర సరుకులకు ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలు ఆయా సమయాల్లో ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వస్తూ వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి టైములో కొన్ని న్యూస్ పేపర్లు ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కన్నెర్ర చేసింది. ఇలాంటి వార్తలు రాయడం అని ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చి…ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని మీడియా ద్వారా ప్రకటనలు జారీ చేయడం జరిగింది.
ఇదే తరుణంలో కరోనా వైరస్…న్యూస్ పేపర్ ల వల్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో…దేశమంతా లాక్ డౌన్ అయిన నేపథ్యంలో…న్యూస్ పేపర్ ప్రచురణ కూడా ఆపేయాలని కేంద్రం సూచిస్తుంది. ముఖ్యంగా వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా న్యూస్ పేపర్ కొనటానికి ఆసక్తి చూపటం లేదు. దీంతో ప్రస్తుత పరిణామాలను బట్టి న్యూస్ పేపర్లు కూడా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.